ప్రజాశక్తి-యంత్రాంగం మణిపూర్ సంఘటనలపై సోమవారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. రాజోలు అంతర్వేది పాలెం నుండి మలికిపురం సెంటర్ వరకు క్రైస్వలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్, మాజీ ఎంఎల్‌ఎ గొల్లపల్లి సూర్యరావు, సంఘీభావం తెలిపారు. ముమ్మిడివరం పాస్టర్స్ ఫెలోషిప్, సిఐటియు సిపిఎం, విద్యార్థి సంఘాలు, ఆర్‌పిఐ, ముస్లిం సంఘాలు, కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన కాశి వాని తూము వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. తహశీల్దారు కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. డిటి యడ్ల రాంబాబుకు వినతిపత్రం అందించారు. పౌల్ రాజు,ఉండ్రాజవరపు ప్రసాద్, జోసెఫ్, బి.జయరాజు, ఎస. ఇమ్మానుయేలు, ఎస్ బాలరాజు, మహమ్మద్ హుస్సేన్, గౌస్, ఆలీ, సుధీర్, శ్రీను, శరత్, సిఐటియు నాయకులు గుదే దుర్గా ప్రసాద్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అంబాజీపేట దళిత ఐక్య వేదిక ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. నెల్లి వెంకటరమణ, కోట రామ్మోహనరావు, పాముల రాజేశ్వరీదేవి, సర్పంచ్ నాగబత్తుల శాంతా కుమారి, ఎంపిపి డి.వెంకటేశ్వరావు, జెడ్పిటిసి బూడిద వరలక్ష్మి, జివి.రాఘవులు, జంగా గౌతమ్, కొంకి రాజమణి, గోసంగి సత్యనారాయణ, నక్కా బాస్కరరావు, పులిదిండి సత్యనారాయణ, వరలక్ష్మి, సర్పంచ్ జల్లి బాలరాజు, నాగవరపు నాగరాజు పాల్గొన్నారు.










