Jul 26,2023 00:15


ప్రజాశక్తి -యంత్రాంగం
మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై ఎపిలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోనిేస్తూ ప్రజా, విద్యార్థి, మహిళ, ఉపాధ్యాయ, రైతు, వామపక్ష సంఘాలు మంగళవారం నిరసన తెలిపాయి. వివరాలు ఇవి..
అమలాపురం మణిపూర్‌ లో జరుగుతున్న సంఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి మణిపూర్‌ ప్రజలకు రక్షణ కల్పించాలని హింసకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా, విద్యార్థి, మహిళ, ఉపాధ్యాయ, రైతు, వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గడియార స్తంభం సెంటర్లో నిరసన తెలిపారు. మణిపూర్‌ బాధితులకు అండగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌ మహిళలకు రక్షణ కల్పించాలని మణిపూర్‌ ముఖ్యమంత్రి ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలని ప్రజా సంఘాల నాయకులు, యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ సమాజమంతా తలదించుకునేలా మణిపూర్‌ లో దారుణమైన సంఘటనలు మతోన్మాదులు సృష్టిస్తున్నారని అన్నారు. మణిపూర్లో మతోన్మాదులు సష్టిస్తున్న మారణకాండను అరికట్టాలని మణిపూర్‌ ప్రజలకు రక్షణ కల్పించాలని మణిపూర్‌ ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు .బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు శ్రీవల్లి, పవన్‌, రవి, ముత్యాల శ్రీనివాసరావు, ఏడిద రాజేష్‌, పోరాకుల సంఘం నాయకులు జిల్లెల్ల మనోహర్‌, అమలదాసు బాబురావు, విద్యార్థి సంఘ నాయకులు రేవు తిరుపతిరావు, సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు కొండా దుర్గారావు మహిళా సంఘం నాయకులు కోంకి రాజమణి, బొంతు రమణ ఉపాధ్యాయ సంఘం నాయకులు జ్యోతి బస్సు, శిరీష, శె ట్టుబత్తుల తులసిరావు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ జ్యోతి బసు, జిల్లా అధ్యక్షులు పెంకె వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి. దుర్గాప్రసాద్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్స్‌ కె. శంకర్‌ , కె. ప్రణీత్‌ సాయి, బి. గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. రాజోలు మణిపూర్‌ రాష్ట్రంలో గిరిజన మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాలకి నిరసనగా ఆ రాష్ట్ర సిఎం రాజీనామా చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం రాజోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటి సభ్యులు పీతల రామచంద్రరావు మాట్లాడుతూ మణిపూర్‌ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ బి.మురళీ ముక్తేశ్వరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బుంగ సత్యనారాయణ, తాడి శ్రీరాముర్తి, శ్రీరాములు, అంగన్‌ వాడీిలు సుజాత, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం మణిపూర్‌ లో దారుణాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలోతహశీల్దార్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా వినత పత్రాన్ని సమర్పిచారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ తక్షణం మాణిపూర్‌ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మండల సిఐటియు అధ్యక్షులు నిమ్మకాయల వెంకటేష్‌, కార్యదర్శి జి.బేబీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, దొమ్మేటి వీర రాఘవులు, లక్ష్మణరావు, వీర్రాజు, చెట్ల గాలి దేవుడు, ఉంద్రుర్తి జాన్సన్‌, ఉంద్రుర్తి బాలకష్ణ, గంటి శ్రీనివాస్‌, మహిళాలు జి.హైమావతి, జి అనంతలక్ష్మి, వి.గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. కాట్రేనికోన మణిపూర్‌ లో జరిగిన అమానవీయ సంఘటకు నిరశనను తెలియజేస్తూ వారిని కఠినం గా శిక్షించాలని కోరుతూ బాధిత మహిళలకు మద్ధతుగా మంగళవారం ఇంటర్నేషనల్‌ దళిత్‌ జర్నలిస్ట్‌ నెట్‌ వర్క్‌ ఆధ్వర్యంలో కాట్రేనికోన తహసీల్దార్‌ కార్యాలయం నందు నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్‌ వి వి వి సత్యనారాయణ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం. రవీంద్ర నాధ్‌, జె.శ్రీనివాస్‌, అయిత్తాబత్తుల శ్రీనివాస్‌ పండుబాబు, బడుగు శ్రీనివాస్‌, గెల్లా రాజేంద్ర ప్రసాద్‌, బీర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.