Aug 04,2023 17:57

ప్రజాశక్తి-మండపేట
మండపేట వల్లూరి అప్పారావు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ ఛైర్పర్సన్‌గా పెంకే గంగాధర్‌ నియమితులయ్యారు. శుక్రవారం సొసైటీ కార్యాలయంలో నూతన త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారోత్సోవం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పతివాడు నూక దుర్గారాణి, జిల్లా రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, కో ఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజాబాబుల అధ్యక్షతన జరిగింది. ఛైర్‌పర్సన్‌గా పెంకే గంగాధర్‌ ప్రమాణం చేశారు.. కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ పిల్లి గణేశ్వరరావు, మున్సిపల్‌ విప్‌ పోతంశెట్టి ప్రసాద్‌, ముమ్మిడివరపు బాపిరాజు, షేక్‌ మరియు షేక్‌ డైరెక్టర్‌ అలీఖాన్‌ బాబా, దేవస్థానం ఛైర్మన్‌ లు సూరంపూడి సత్య ప్రసాద్‌ పాల్గొన్నారు.