ప్రజాశక్తి-అమలాపురం
మహిళల రక్షణ చట్టాలపై విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా దిశా డిఎస్పి మురళీమోహన్ అవగాహన కల్పించారు. జిల్లా ఎస్‌పి శ్రీధర్ ఉత్త ర్వుల మేరకు, అడిషనల్ ఎస్‌పి ఖాదర్ బాషా పర్య వేక్షణలో మహిళ రక్షణ, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ చట్టాలు, చైల్డ్ పొర్నోగ్రఫీ, ఈవ్ టీజింగ్, ర్యాగి ంగ్, డ్రగ్ అబ్యూస్ సైబర్ క్రైమ్స్ మొదలుగు విష యాలపై జిల్లా దిశా డిఎస్పి మురళీమోహన్, అయినవిల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందితో అయినవిల్లి మండలం ముక్తేశ్వరం గ్రామంలోని జెడ్‌పి హైస్కూ ల్లో విద్యార్థిని, విద్యార్థులకు సమావేశాలు నిర్వహి ంచి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దిశా డిఎస్పి మురళీమోహన్, సిబ్బంది, అయిన విల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్కూల్ హెచ్‌ఎం, టీచర్లు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.










