ప్రజాశక్తి- రామచంద్రపురం :కాలితొడ భాగంలో కణితి ఏర్పడి ఎంతోకాలంగా బాధపడుతున్న ఒక మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆ కనితిని విజయవంతంగా తొలగించారు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి వైద్య బృందం. దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే రామచంద్రాపురం మండలంలోని తాళ్ల పొలం గ్రామానికి చెందిన సయ్యద్ హమిది అనే మహిళ కొంతకాలంగా తన ఎడమ కాలు తొడ భాగంలో కనితి ఏర్పడి బాధపడుతుంది.దీంతో రామచంద్రపురం ఆసుపత్రి వైద్య బృందం గురువారం ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. డాక్టర్ కళ్యాణి ,డాక్టర్ ప్రవీణ్ ,డాక్టర్ సౌమ్య, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వీరభద్రుడు పర్యవేక్షణలో శాస్త్ర చికిత్స నిర్వహించి 2.5 కేజీల కణితిని తొలగించారు. సుమారు నాలుగు గంటలసేపు వైద్య బఅందం శ్రమించి ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం శత్రాశికిత్స చేయించుకున్న మహిళ కోరుకుంటుందని సూపరిండెంట్ తెలియజేశారు. అరుదైన శత్రచికిత్స నిర్వహించిన వైద్య బఅందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు.










