ప్రజాశక్తి-ఆలమూరు
మండలంలోని మడికి గ్రామ టిడిపి ధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, స్థానిక సెంటర్ వద్దకు చేరుకుని బాణసంచా కాల్చారు. అనంతరం రావులపాలెంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి కొత్తపేట టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు మడికి నుండి సుమారు 300 ద్విచక్ర వాహనాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు మరో 20 ఆటోల్లో మహిళ కార్యకర్తలు ర్యాలీగా జొన్నాడ సెంటర్ వద్దకు చేరుకుని అక్కడి నుండి చంద్రబాబు కాన్వారు తో కలిసి రావులపాలెంకు తరలి వెళ్లారు.










