Jul 07,2023 23:12

ప్రజాశక్తి-అమలాపురం
జిల్లాలో మాతాశిశు మరణాలు రేట్లు తగ్గించేందుకు, గర్బిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో స్గ్రీ శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించి మాతా శిశు మరణాలు, శిశు సురక్ష కార్యక్రమాలు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లు సరఫరా, వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు, నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధుల సర్వే నియంత్రణ చర్యలు, ఆయుష్మాన్‌ భారత్‌ ఇకెవైసి ప్రక్రియలో పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ ఆయన మాట్లాడుతూ పోషకాహార లోపాలు, బరువు ఎత్తు తక్కువ గల చిన్నారులకు అనుబంధ పోషకాహా రాన్ని క్రమం తప్పకుండా అందిస్తూ రెగ్యులర్‌ చెకప్‌ ల ద్వారా పోషకా హార లోపాలను చక్కదిద్దా లన్నారు. సకాలంలో ఇమ్యునైజేషన్‌ ప్రక్రియలు నిర్వహిస్తూ ప్రాణాంతక వ్యాధు లు వారి నుంచి చిన్నారులను కాపాడాల న్నారు. ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లను బాలింతలు, గర్బిణుల ఇంటికే సరఫరా చేస్తారన్నారు. డోర్‌ డెలివరీ బ్యాగులను డిఆర్‌డిఎ సరఫరా చేస్తుందని ఆయన వెల్లడించారు. నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులు కమ్యూనల్‌ వ్యాధులు సర్వేను పూర్తి చేయాలని తదుపరి వారికి స్క్రీనింగ్‌ నిర్వహించి కనుగొన్న వ్యాధుల నియంత్రణ చికిత్సలు వెంటనే ప్రారంభించాలన్నారు. ఇటీవల కాలంలో సిహెచ్‌సి, ప్రాంతీయ ప్రాథమిక ఆసుపత్రులలో అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ఎటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా సకాలంలో వైద్యులు విధులకు హాజరై వైద్య సేవలు అందించాలన్నారు. ఇటీవల అన్ని ఆసుపత్రులలో వైద్యుల పోస్టులు భర్తీ చేశామన్నారు. శిశు సురక్ష కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుప త్రులలో సాధారణ ప్రసవాలన్నీ నిర్వహిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాల సమన్వయ అధికారిని పద్మశ్రీ రాణి, డిఎంహెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర, జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారిని జివి.సత్యవాణి, ఫ్యామిలీ ఫిజీషియన్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సుమలత, సచివాలయం నోడల్‌ అధికారి భీమేశ్వరరావు, అదనపు డిఎంహెచ్‌ఒ సిహెచ్‌వి భరత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.