Jul 27,2023 23:26

సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రజాశక్తి-అమలాపురం
మణిపూర్‌లో ఆదివాసి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసను అరికట్టేందుకు కేంద్రం తక్షణం స్పందించాలని అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ నాయకులు, సిఐటియు నాయకులు డిమాండ్‌చేశారు. గురువారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీగా నినాదాలు చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిచారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ తక్షణం మాణిపూర్‌ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బేబీ గంగా రత్నం మాట్లాడుతూ అల్లర్లకు పాల్పడే అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకుని ామాణిపూర్‌ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల సిఐటియు కార్య దర్శి జి.అమూల్య, జి.బేబీ గంగరత్నం, ఎం.విజయ, కె.రత్నకుమారి, ఎ.కనకదుర్గ, పి.త్రివేణి, ఎం. మణికుమారి, దైవ కప నిరసనలో పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో నిరసన
మణిపూర్‌ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి వెంటనే ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ గురువారం జిల్లాలో ఐద్వా ఆధ్వర్యంలో అమలాపురం పరంజ్యోతి కాలేజీ విద్యార్థులతో నిరసన తెలియజేశారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.నాగ వరలక్ష్మి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసపై మహిళల పోరు యాత్రను జయప్రదం చేయాలని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలంటూ మహిళలకు రక్షణ కల్పించాలని అందరూ చేయి చేయి కలుపుదాం అంటూ ఈ జాతను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. భువనేశ్వరి, టీ .ప్రమీల, విజయ, నాగ దుర్గ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం మణిపూర్‌ రాష్ట్రంలో ప్రజల పై మారణకాండ ను తక్షణమే ఆపాలని, మణిపూర్‌ హింసకు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని పిడిఎస్‌యు, ఎఐకెఎంఎస్‌, పి వై ఎల్‌, దళిత ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు వెంటపల్లి భీమా శంకర్‌, పిడిఎస్‌ యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బి. సిద్ధూ, పి వై ఎల్‌ జిల్లా నాయకులు అంబటి కష్ణ, రేవు నాగేశ్వరరావు, గుబ్బల శ్రీను, బిఎస్‌పి నాయకులు కె. కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
31న శాంతి ర్యాలీ
రాజోలు మణిపూర్‌లో అమానవీయ ఘటనలకు నిరసనగా జూలై 31న సఖినేటిపల్లి నుంచి మల్కీపురం వరకూ క్రైస్తవులు నిర్వహించే శాంతి ర్యాలీలో దళిత సంఘాల నాయకులందరూ పాల్గొవాలని దళిత నాయకులు పిలుపునిచ్చారు. గురువారం రాజోలు మండల దళిత సంఘాల ఐక్య వేదిక తరుపున దళిత నాయకుల చింతలపల్లి, కూనవరం, ములికిపల్లి, కాట్రేనుపాడు గ్రామాల్లో కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జై భీం విజ్ఞాన సంఘం అధ్యక్షులు బత్తుల సరస్వతీ రావు, దళిత సంఘాల నాయకులు కొంబత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.