ప్రజాశక్తి-అమలాపురం
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి, సిఎం ఓ కార్యాలయం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి న్కార్డ్ కమిటీ మీటింగ్ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించి మాదకద్రవ్యాలను సరఫరా మూలాలను అరికట్టడంతో పాటు సమాజంలో వాటికి డిమాండ్ను పూర్తిగా తగ్గించి అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒరిస్సా చతీస్ గడ్ వంటి పక్క రాష్ట్రాల నుండి గంజాయి ఉత్పత్తి కాకుండా ప టిష్టమైన చర్యలు జిల్లా యం త్రాంగాలు చేపట్టాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా గంజాయి రవాణా సింథటిక్ డ్రగ్స్ సీజ్ , అంశాలపై సమీక్షించారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర ఆహార పంటలు సాగు చేయిం చాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగిస్తాయన్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసన మన్నారు. మాదక ద్రవ్యాల నిరోధాని కి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసిందన్నారు. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపా రం చేసేవారు, కలిగివున్న వారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హుల న్నారు. ముఖ్యంగా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్, డిఆర్‌ఒ సిహెచ్.సత్తిబాబు, కలెక్టరేట్ సెక్షన్ అధికారి రమణకుమారి తదితరులు పాల్గొన్నా రు.
జాబ్ మేళాతో యువతకు ఉపాధి
ఆసక్తి కలిగిన సేవా రంగాలలో లేదా పరిశ్రమ లలోనూ ఉపాధి అవకా శాలను పొంది స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు స్పందన హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొని నిరుద్యోగ యువత తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత పరిశ్రమలు సేవా రంగాల సమన్వయంతో అమలు కాపాడు తున్న జాబ్ మేళా ద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువత విద్యార్హతలు శిక్షణ కోర్సులలో తర్ఫీదు వంటి అంశాలను ఆయన ఆప్యాయంగా నిరుద్యోగ యువతను అడిగి ఉద్యోగ అవకాశాలు పొందాలని శుభాకాంక్షలు తెలియ జేశారు.










