- న్యాయవాదులు విధులు బహిష్కరణ
ప్రజాశక్తి-రామచంద్రపురం : విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయసం ఆదిశేషు విటల్ బాబును కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినందుకు నిరసనగారామచంద్రపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, న్యాయవాదులపై దాడులను అందరూ ఖండించాలని నినాదాలు చేశారు. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాడ్రేవు సాయి ప్రసాద్, ఉపాధ్యక్షులు డి.వి.ఎస్ ఎస్ శర్మ, పలివెల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి చిన్నం వీరెడ్డి, జూనియర్ న్యాయవాదుల ప్రతినిధి పిల్లా రామయ్య, మహిళా న్యాయవాదుల ప్రతినిధి పలివెల సత్యవాణి, న్యాయవాదులు డి.పి శాస్తి, పోలిశెట్టి శ్రీనివాస్, కె.భరత్ కుమార్, దొమ్మలపాటి సత్యనారాయణ, నీలంమధుసూదనరావు, కె.వివిసత్యనారాయణ చోడి జాన్ రత్నం, తదితరన్యాయవాదులు పాల్గొన్నారు.










