Jul 19,2023 23:58

ప్రజాశక్తి-రామచంద్రపురం
గోదావరి నది ఎగువ పరివాహకప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరద నీరు భారీగా చేరుతోందని రాబోయే 3 రోజుల్లో సుమారు 5, లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వరద ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుందనిజిల్లా గోదావరి తీర ప్రాంత ప్రజానీకం అప్రమ త్తంగా ఉండాలన్నార. జిల్లా యంత్రాంగం వరద హెచ్చరికలు ఎప్పటి కప్పుడు తెలియజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. సంప్రదించాల్సిన నెంబర్లు ఆలమూరు, కపిలేశ్వర పురం మండలాలు ఎన్‌.డేవిడ్‌ రాజు ఫోన్‌. 9948029350, ఎన్‌ నవ్య ఫోన్‌.9866443065, కె.గంగవరం మండలం ఎన్‌ డేవిడ్‌ రాజు ఫోన్‌. 9948029350, నాయుడు దిలీప్‌ తేజ ఫోన్‌ 9441604624, పి.గన్నవరం మండలం పిడికె.ప్రసాద్‌, ఫోన్‌. 7095687724, జిజి.బాబూజీ ఫోన.్‌ 494957498 లో సంప్రదించాలని ఆయన సూచించారు. కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004252532, ధవలేశ్వరం కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 0883 2417066