ప్రజాశక్తి-రామచంద్రపురం
పట్టణ లైన్ ఇన్‌స్పెక్టర్‌గా యల్లమిల్లి రవికుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. రాయవరం మండలం నదురుబాద గ్రామ లైన్‌మ్యాన్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఆయన రామచంద్రపురం పట్టణంలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. ఆయన పట్టణ ఎఇ మేడిశెట్టి వెంకటరమణ కు ప్రమోషన్ ఆర్డర్స్ అందజేశారు. రవికుమార్‌ని జెఇ కె. సీతారామ దొర, లైన్ ఇన్‌స్పెక్టర్ జాన్ సుధాకర్, స్థానిక లైన్‌మెన్‌లు లోవరాజు, వి. గోవిందు, వి. రవి, పి. గోవిందు, కె.రామకృష్ణ, పి. ప్రసాద్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఉద్యోగులంతా స్నేహ భావంతో బాధ్యతా యుతంగా పనిచేయాలని తనకు అభినందనలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.










