టిడిపి సీనియర్ నాయకులు వక్కలంక బుల్లియ్య
ప్రజాశక్తి - అంబాజీపేట
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కుట్రతోనే అరెస్టు చేశారని టిడిపి సీనియర్ నాయకులు వక్కలంక బుల్లియ్య అన్నారు. బాబు ప్రచార యాత్రలో ప్రజా స్పందన చూసి తట్టుకోలేక ప్రభుత్వం కావాలని అక్రమ కేసులు పెట్టిందన్నారు. అధికారం చేతిలో ఉంటే ఎన్ని దుర్మార్గాలైనా చేయొచ్చనే ప్రభుత్వ ధోరణిని ప్రజల గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ అభియోగాలు మోపి జైలుకు పంపినా, ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని తీయలేరన్నారు. ప్రజల ప్రయోజనాలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, నిరంతరం శ్రమిస్తున్న బాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించారన్నారు. బంద్ విజయవంతం కావడమే దీనికి నిదర్శనమన్నారు.










