Jul 07,2023 00:10

ప్రజాశక్తి-రామచంద్రపురం
బేడ బుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ ఆర్‌డిఒ పి.సింధుకు ఎర్ర పోతవరం గ్రామంలో గల బుడగ జంగాల జిల్లా అధ్యక్షులు పేర్ల దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎర్రపాతవరంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్‌డిఒకు వివరించారు రాజ్యాంగం ప్రకారం బేడ బుడగ జంగాలను ఎస్‌సిలుగా పరిగణిం చాలని అయితే తమకు ఇప్పటివరకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పథకాలు అందడం లేదన్నారు. దీనిపై అధికారులు స్పందించి తమకు ఎస్‌సి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పేర్ల దుర్గాప్రసాద్‌, గోటూరి గణేష్‌, గంధం మరిడియ్య, పేర్ల మహేష్‌, కిన్నెరరాజు, పొట్ల బోబమ్మ, పేర్ల వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 40 ఏళ్లుగా నివసిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించాలని బేడ బుడగ జంగాల జిల్లా నాయకులు పేర్ల దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కె.గంగవరం మండలంలోని ఎర్ర పోతవరంలో బుడగ జంగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న బేడ బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించి సర్టిఫికెట్లు అందజేస్తున్నారని, కోస్తాంధ్ర, రాయలసీమలో స్థానిక అధికారులు తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పలు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. దీనిపై ప్రభుత్వం 2017 లో జిసి శర్మ ఆధ్వర్యంలో కమిషన్‌ వేశారని దీనిపై 2020లో కోస్తాంధ్రలో బేడా బుడగ జంగాలు ఉన్నారని నివేదిక ఇచ్చార న్నారు. ప్రస్తుతం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో సంక్షేమ పథకాలు అంద డం లేదన్నారు. దీనిపై అధికారులు స్పందించి ఎస్‌సి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో బేడ బుడగ జంగాలు పాల్గొని న్యాయం చేయాలని నినాదాలు చేశారు