ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం స్థానిక ఆదిత్య పాఠశాల కామనగరువు విద్యార్థినీ విద్యార్థుల యొక్క గ్రాండ్ పేరెంట్స్ సమావేశ కార్యక్రమం ఆదివారం పాఠశాల ఆవరణలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి.రామ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి.రామ ప్రసాద్ గ్రాండ్ పేరెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రాండ్ పారెంట్స్ మన వారసత్వ సంపదని, వారిని గౌరవించడం అనేది మహాభాగ్యమని చెపుతూ మీ మనుమలకు, మనుమరాండ్రకు చక్కని విలువలతో కూడిన మాటలు చెప్పడం లో మీరెప్పుడూ ముందుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనిన విద్యార్థుల యొక్క గ్రాండ్ పేరెంట్స్ ను సత్కరించడం తో పాటు వారికి వివిధ ఆటలపోటీలు నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులతో పాటు ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం అందించిన చిరు కానుకలను అందించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థుల యొక్క గ్రాండ్ పేరెంట్స్ కు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్.శృతిరెడ్డి, స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిప చలపతి రావు అభినందనలు తెలియజేశారు.










