అపస్మారక స్థితిలో యువకుడు
ప్రజాశక్తి-రామచంద్రపురం
కె.గంగవరం మండలంలోని కోటిపల్లి వద్ద బుధవారం ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్ నాతి రవి అనే యువకుడిని ఢ కొట్టింది. వంతెన పక్కన ఉన్న యువకుడు కాలుపై లారీ ఎక్కడంతో అతను వంతెన పైనుండి కాలువలోకి పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయం అయింది అపస్మార్క స్థితిలో ఉన్న యువకుడ్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. నిత్యం అతివేగంగా వెళుతున్న లారీలు పలు ప్రమాదాలకు కారణం అవు తున్నాయి. అంటూ కోటిపల్లి గ్రామస్తులు బుధవారం రాత్రి ఆందోళన కార్యక్రమం చేపట్టారు వారంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో కోటిపల్లి మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.










