Aug 19,2023 23:43

ప్రజాశక్తి-అమలాపురం
కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపన దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నేటి యాంత్రిక యుగంలో మానవులకు స్థానికంగా లభించే కొబ్బరి చిరుధాన్యాలతో తయారు కాబడే ఎడిబుల్‌ బిస్కెట్‌ టీ కప్పుల విని యోగంతో ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం స్థానిక మెయిన్‌ రోడ్‌ లోని కెనరా బ్యాంకు బ్రాంచ్‌ పక్కన అనిత ఇండిస్టీస్‌ వారి ఎడిబుల్‌ బిస్కెట్‌, టీ కప్పు తయారీ పరిశ్రమను జిల్లా కలెక్టర్‌ ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపన దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానికంగా తయారు చేసే ఎడిబుల్‌ బిస్కెట్‌ టీ కప్పులో టీ, లేదా పానీయాలను తాగిన పిదప తిని వేయవచ్చునని ఈ విధానం వల్ల ఇటు ఆరోగ్యానికి అటు ప్రకతిపరంగా ఎంతో శ్రేయ స్కరమని తెలిపారు. ఈ కప్పు దాదాపు 20 నిమిషాల పాటు వేడిని తట్టుకుంటుందన్నారు. ఈ ఎడిబుల్‌ బిస్కెట్‌ టీ కప్పులను రాగి మొక్కజొన్న, గోధు మలు, వంటి చిరుధాన్యాలు, కోకోనట్‌ తదితర ఫ్లేవర్‌ తో తయారు చేయడం వల్ల పోషకా హారంగా కూడా ఉపయోగ పడుతుందన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మేలును చేకూర్చడంతో పాటుగా పర్యావరణహితంగా ఈ కప్పులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం వాడుతున్న ప్లాస్టిక్‌ మరియు పేపర్‌ కప్పులకు బదులు ఎడిబుల్‌ బిస్కెట్‌ టీ కప్పులను ఉపయోగించడం అన్ని విధాల మేలు చేకూరుతుందన్నారు. పానీ యాలు వినియోగానికి ఈ ఎడిబుల్‌ బిస్కెట్‌ కప్పులు అన్ని విధాలుగా దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బివి.రమణ, ఎల్డిఎం.ప్రసాదు, జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ (బ్యాంకు లింకేజీ) డివిఎల్‌.అన్నపూర్ణ, అనిత ఇండ స్ట్రీస్‌ పరిశ్రమ స్థాపకురాలు దానాల అనిత, తదితరులు పాల్గొన్నారు.