ప్రజాశక్తి-మండపేట : స్థానిక జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పెంటపాటి కనకదుర్గ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినట్లు ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు వివికె మందేశ్వరరావు తెలిపారు. 582 మార్కులు సాధించి పాఠశాలలో ప్రధమ స్థానం, నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థిని నూజివీడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ సంస్థ ట్రిపుల్ ఐటీ ప్రధమ కౌన్సిలింగ్ లో ప్రవేశం సాధించిందన్నారు. ఉత్తమ ప్రతిభతో సీటు సాధించిన కనకదుర్గ ను ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.










