ప్రజాశక్తి-అమలాపురం
పట్టణములోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్దముగా నిర్మించిన రెండు కమర్షియల్ భవనాలను గురువారం జిల్లా ఇంఛార్జి రీజనల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె.కుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. గాంధీ బజార్‌లోని ఎ.వెంకట నాగేశ్వర సురేంద్ర కుమార్ కమర్షియల్ కాంప్లెక్స్(శ్రీసాయి ఫ్యాషన్ ప్యాలెస్) ను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఆ భవనమునకు సంబందించి పార్కింగ్ కు ఉపయోగించవలసిన స్థలము నందు షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్వహించుట, సెట్ బ్యాక్లు, బిల్డింగ్ ఎత్తులో వైవిధ్యం, 3వ ఫ్లోర్ లో అనధికారిక నిర్మాణం 4వ ఫ్లోర్ నందు షెడ్ నిర్మాణం మొదలగు అంశాలలో ఉల్లంఘనలను గుర్తించారు. మహీపాల వీధిలోని బొర్రా వీర వెంకట లక్ష్మి పద్మావతి కమర్షియల్ కాంప్లెక్స్ (హాపీమార్ట్)ను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఆ భవనమునకు సంబంధించి సెట్ బ్యాక్లు, బిల్డింగ్ ఎత్తులో వైవిధ్యం, 3వ, 4వ ఫ్లోర్ లలో అనధికారిక నిర్మాణం, పార్కింగ్ కు ఉపయోగించవలసిన స్థలము నందు హ్యాపీమార్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్వహించుట తదితరఉల్లంఘనలను గుర్తించారు. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్Ûమెెంట్ అధికారి కె.కుమార్ తెలియజేశారు. ఈ తనిఖీల్లో డిఇఇ(ఇంఛార్జ్) సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎఇఇలు సుధీర్, అచ్చిరెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులు వార్డు సచివాలయ సిబ్బంది, విజిలెన్స్ కానిస్టేబుల్ లోవరాజు పాల్గొన్నారు.










