Sep 13,2023 23:10

ప్రజాశక్తి-మండపేట
రాష్ట్రంలో డిగ్రీ విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన హానర్స్‌ కోర్సుల్లో ఎక్కువ ప్రవేశాలు లేవనే సాకుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొన్ని కోర్సులు ఎత్తివేయడం అన్యాయమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ మదన్‌ గుంజా అన్నారు. ఎదైనా నూతన కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని వాటిని అధిమించగలిగితేనే కోర్సులు ప్రవేశపెట్టాలే తప్ప కోర్సులు ప్రవేశపెట్టి ఎక్కువ మంది విద్యార్థులు లేక కోర్సు తీసీవేస్తే మరి జాయిన్‌ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. నూతనంగా వచ్చిన హానర్స్‌ విధానం గందరగోళంగా ఉండడంతో ప్రవేశాలు తగ్గనప్పటికి అసలు జాయిన్‌ అయిన విద్యార్థుల గురించి ఆలోచించాలని అన్నారు. విద్యార్ధులను బలవంతంగా కళాశాలలు మార్చడం, గ్రూపులు మర్చివేయడం, ఇక్కడ ఉన్న గ్రూపులు ఎత్తివేయడం చేస్తే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ టికెవి.శ్రీనువాసురావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ మదన్‌ గుంజా , మండలం కార్యదర్శి వెలుమూరి హెమంత్‌ కుమార్‌, డి.కిషోర్‌, కె.ప్రసన్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.