Sep 01,2023 00:28

ప్రజాశక్తి-అమలాపురం
జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ నందు వాతావరణంలో వచ్చే మార్పులు మానవుని ఆరోగ్యం పట్ల ఏ విధమైన ప్రభావాలు చూపుతాయన్న అంశంపై జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పు మానవ ఆరోగ్య ప్రభావాల మీద జాతీయ కార్యక్ర మాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు. జాతీయస్థాయిలో వాతావరణం మార్పు అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చడం జరిగిందన్నారు. ఆ విధివిధానాలు సక్రమంగా అమలు అయ్యే రీతిలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పర్యవేక్షించాలని ఆదేశించా రు. వాయు, జల కాలుష్యాలు నియంత్రణతో పాటుగా గ్రీనరీ డెవలప్మెంట్‌ కు పక్కాగా చర్యలు చేపట్టి ఆ యొక్క వాతావరణ మార్పులు ప్రభావం మానవులపై అంతగా పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆరోగ్యకరమైన వ్యవస్థలు బలోపేతానికి చర్యలు తీసుకుంటూ ఆరోగ్యకర పరిస్థితులు నెలకొనేలా ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టంగా చేపట్టాల న్నారు. అటవీశాఖ సముద్రతీరం వెంబడి మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహించి సముద్రపు కోత నుండి తుఫాన్లు బారిన పడకుండా రక్షణ కవచంగా ఉండేలా రక్షణ చర్యలు చేపట్టాల న్నారు రవాణా శాఖ కాలుష్య నియంత్రణకుగాను సిఎన్జి ఎలక్ట్రికల్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిం చాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మున్సిపల్‌ కమిషనర్లు తరచుగా వాయు జల కాలుష్యం దాని మూలాలు, రకాలు అన్వేషణ కొరకు నమూనాలు సేకరించి, విశ్లేష ణలు చేస్తూ కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు గైకొనడంతో పాటుగా పారిశుద్ధ్య వ్యవస్థను మె రుగుపరిచి సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలన్నారు. మున్సిపల్‌ అధికారులు పురపాలక సంఘాల పరిధిలో మొక్కలు ఎక్కువగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ సురక్షిత మైన సాగునీటిని అందించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిరోధించి ప్రత్యామ్నాయం గా పర్యావరణ హిత సాంప్రదాయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించా లన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వినీల ప్రియాంక మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతి ఏడాది వాతావరణ మార్పులు మూలంగా సంక్రమిస్తున్న వ్యాధుల ముందస్తు నివారణ చర్య లు పటిష్టంగా అమలు చేయా లని సూచించారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం. దుర్గారావు దొర, డిపిఒ వి.కష్ణకు మారి, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు, డిఇఒ ఎం.కమల కుమారి, డిఎఫ్‌ఒ ఎంవి.ప్రసాద్‌ రావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిని జివి. సత్సవాణి తదితరులు పాల్గొన్నారు.
'విశ్వకర్మ యోజన'పై అవగాహన
గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ కుల వృత్థిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ నందు ఈ పథకం అమలుకు సంబంధించి జిల్లా స్థాయి అమలు కమిటీ అధికారులతో అవగాహన సమావే శం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించి అమలు తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17న ప్రారంభమయ్యే ఈ పథకంపై పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. తొలుత ఈ పథకంపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్లకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవ డంతోపాటు లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ టి.మురళి, అసిస్టెంట్‌ మేనేజర్‌ శివరాం ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.
సిఆర్‌జెడ్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం
జిల్లాలో సముద్ర తీర ప్రాంతం వెంబడి జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనల కు వ్యతిరేకంగా ఇసుక రీచ్‌ లు ఆక్వా చెరువులు ఏర్పాటు చేయరాదని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సి ఆర్‌ జెడ్‌) జిల్లా స్థాయి కమిటీ సమావేశం కమిటీ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాలానుగు ణంగా సవరించబడిన కోస్టల్‌ రెగ్యులైజేషన్‌ జోన్‌ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అతిక్రమించి చేపడుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌, ఆక్వా చెరువులు ఏర్పాటు వంటివి గుర్తించి నష్టపరిహారాలు విధిస్తామన్నారు.