Aug 06,2023 23:55

ప్రజాశక్తి-మండపేట
మూడు దశాబ్దాల కిందట మండపేట జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుకున్న 1993-1995 పూర్వ విద్యార్థులు ఆదివారం మండపేట ఆలమూరు రోడ్డులో గల కాపు కళ్యాణ మండపంలో సందడి చేశారు. ఆరు నెలల కిందట కొమ్మిరెడ్డి శ్రీనివాస్‌ తన మిత్రులు జాయన సాయి, దొడ్డిపట్ల ప్రకాష్‌, కోటిపల్లి కష్ణ, ఆరేటి నాని, కంది అప్పారావు, కాయల రమేష్‌, నగేష్‌ తదితరులతో కలసి ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఈ కలయిక సాధ్యమైంది. తొలుత తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు విజయ సారథి, నాగయ్య, వీరన్న, రాజేంద్రప్రసాద్‌, శ్యామకుమారి, మంగాదేవి, నాగ రవిలను ఘనంగా సన్మానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన మిత్రులు అందరూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కలుసుకొని ఆటపాటలతో ఆనాటి తీపి జ్ఞాపకాలతో సందడి చేశారు. కార్యక్రమంలో పెమ్మాడ శ్రీనివాస్‌, పి ఆర్‌ఎల్‌.స్వామి, శేఖర్‌, హుస్సేన్‌, స్వామి, రామ తులసి, రామలక్ష్మి, సువర్ణరాణి, రాధ, విజ్జి, ప్రసన్న, రాజీ, రాజ్యలక్ష్మి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.