Jul 12,2023 15:20

ప్రజాశక్తి - కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండలంలోని పడమర ఖండ్రిక గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా హాజరైన ఎమ్మెల్సీ తోట్ల త్రిమూర్తులు తనయుడు తోట పృధ్విరాజ్, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పిటిసి పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ మూర్తి, ఎంపీడీవో ఎం రామకృష్ణారెడ్డి, తహసిల్దార్ కె సూర్యారావులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత కలిగి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని అధికారులు గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు వారు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం రామకృష్ణారెడ్డి తహశీల్దార్ కె సూర్యారావు పలు శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది పంచాయితీ వార్డ్ మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి ఐ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.