ప్రజాశక్తి-మండపేట : మండలంలోని కేశవరం గ్రామంలోని మొదటి సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పౌర సేవలు సంతృప్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత కలిగి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని అధికార యంత్రాంగం గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు వారు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ టి.ఆర్ రాజేశ్వరరావు, మండల పరిపాలన అధికారి వి.ఎన్ ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ సొంతం పాపారావు, పంచాయితీ వార్డ్ మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










