ప్రజాశక్తి-అమలాపురం
చిరు వ్యాపారులకు జగనన్న తోడు ఆర్థిక భరోసాగా అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా జగనన్న తోడు రుణాల కల్పన మరియు చెల్లించాల్సిన వడ్డీలను వర్చువల్ విధానంలో బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లా డుతూ తమకు తాముగా ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందిస్తూ వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్న చిరు వ్యాపారులు సాంప్రదాయాలు వత్తి వ్యా పారులకు చేయూతగా జగన న్న తోడు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిందన్నారు. జగనన్న తోడు పథకం ప్రభుత్వ ప్రధాన సామాజిక అభివద్ధి పథకమన్నా రు. జగనన్న తోడు పథకం ప్రారంభిం చడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశంలో చిన్న వ్యాపా రాలు చేసుకునే వ్యక్తులకు మూల ధన రుణాలు అందించడమేనన్నారు. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయాలు పథకం యొక్క నోడల్ విభాగంగా వ్యవహరిస్తూ రెండు సచివాలయాలను ఒక బ్యాంకు బ్రాంచ్ తో మ్యాపింగ్ చేస్తూ రుణాలు కల్పన జరుగుతోందన్నారు. సకాలంలో రుణాలు ఒక ఏడాది లో తిరిగి చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని నిరుపేదలైన చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వ త్తులు, హస్త కళాకారులు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు వడ్డీ లేని రుణాలను అందిస్తోందన్నారు. చేతి వత్తి పనివారు స్వయం వద్ధి సాధించే దిశగా సకాలంలో రూ 10,వేలు తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు అదనంగా రూ.1000 జోడించి రూ.13వేలు వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ పెట్టుబడి ఖర్చు లకోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా చిరు వ్యాపారుల పరిస్థితిని సమూలంగా మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు ప్రభు త్వం మంజూరు చేస్తోంద న్నారు.
డిఆర్‌డిఎ పథక సంచాలకులు వి.శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 22 జిల్లాల పరిధిలో వడ్డీ రాయితీ కింద 13,758 లబ్ధిదారులకుగాను రూ.30,78,936 జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1లక్షా,2 వేల 426 లబ్ధిదారులకు రుణాల కల్పన ద్వారా రూ.102.42 కోట్లు లబ్ధిచేకూరిందని ఆయన తెలిపారు. వీరికి వడ్డీ రాయితీ కింద రూ.2 కోట్ల 58 లక్షలు చెల్లించినట్లు తెలిపారు అదేవిధంగా ఏడవ దశలో 14,431 మంది చిరు వ్యాపారులకు గాను రూ.15కోట్ల 54లక్షలపదివేలు రుణాల కల్పనకు ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ స్పందనను తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహిళలు వారి కుటుంబాల పాలిట గొప్ప వరంగా మారాయని అభిప్రా యాలు తెలిపారు.కార్యక్రమంలో ఎంఎల్‌సిలు కె.సూర్య నారాయణ రావు, బొమ్మి ఇజ్రాయెల్, పి. గన్నవరం ఎంఎల్‌ఎ కె.చిట్టిబాబు, హితకారిణి సమాజం ఛైర్మన్ కాశీ బాల ముని కుమారి, వక్ఫ్ బోర్డ్ ఛైర్‌పర్సన్ షేక్ అబ్దుల్ ఖాదర్, దశ్యకళల అకాడమీ ఛైర్మన్ కె.సత్య శైలజ, పురపాలక సంఘ ఛైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, తదితరులు పాల్గొన్నారు.










