Jul 19,2023 23:56

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతిని ధులు పాల్గొని లబ్ధిదా రులకు ధృవపత్రాలు అందజేశారు. ఈ వారు మాట్లాడతూ జగనన్న సురక్షను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రామచంద్రపురంసిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ అన్నారు.బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని హౌసింగ్‌ బోర్డ్‌ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలోలో మంత్రి పాల్గొనీ ప్రసంగించారు. కార్యక్రమంలో రామచంద్రపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్‌ కె.శ్రీకాంత్‌ రెడ్డి, తాసిల్దార్‌, తేజేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులు ,లబ్ధిదారులు పాల్గొన్నారు.మామిడిికుదురు అప్పనపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పాల్గొని లబ్ధిదారులకు పలు రకాల ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గెడ్డం మహాలక్ష్మి, ఎంపిటిసి సభ్యురాలు బొంతు నీలిమ, కటకం శెట్టి ఆదిత్య, జక్కంపూడి వాసు గడ్డం కష్ణమూర్తి, తులా గోపాలకష్ణ, ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌ కారుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష పథకాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. బుధవారం కపిలేశ్వరపురం మండలం మాచరలో గ్రామ సర్పంచ్‌ వాసంశెట్టి సునీత అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌సి తోట ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పలు రకాల మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసిసభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారా యణ, ఎంపిటిసి సభ్యురాలు శీలం సూర్యకుమారి, ఎంపిపి మేడిశెట్టి సత్యవేణ తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు అర్హత లక్ష్యంగా లబ్ధిదా రులను గుర్తించి సంక్షేమ పథకాల ధ్రువపత్రాలను అందిస్తున్నామని ఎంపిడిఒ కె.జాన్‌లింకన్‌, తహశీల్దార్‌ ఐ.పి.శెట్టి అన్నారు. పెనికేరు, మూలస్థానంలలో సర్పంచులు వనుం చిన్నావతి జార్జిబాబు, వరప్రసాద్‌ ల అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధృపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎఇలు పోసమ్మ, డి.శ్రీనివాస్‌, డిటిలు జానకి రామయ్య, జానకి రాఘవ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అమలాపురం రూరల్‌ సమనస గ్రామ సచివాలయంలో సర్పంచ్‌ పరమట శ్యామ్‌ కుమార్‌ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. జెడ్‌పిటిసి సభ్యులు పందిరి శ్రీహరి రామ్‌ గోపాల్‌, ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని కరికాల భక్త సేవా సంఘం డైరెక్టర్‌ కరేళ్ల రమేష్‌ బాబు, అమలాపురం మండల కో ఆప్సన్‌ సభ్యుడు మొసలి స్పర్జన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.