ప్రజాశక్తి-రామచంద్రపురం
గ్రామాల్లో నివసించే వారికి అక్కడికక్కడే వారికి కావలసిన ధవపత్రాలు పొందే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూవినియోగించుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం మంత్రి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలం కందులు పాలెం సచివాలయం పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే పలు అవస్థలు పడే వారని సిఎం జగన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను జగనన్న సురక్షతో సేవలు ఇంటి వద్దకేఅందుతున్నాయని తెలిపారు. అత్యవసరపరిస్థితుల్లో తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వీలుగా జగనన్న సురక్ష కార్యక్రమం దోహద పడుతుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు ధ్రువపత్రాలు కావలసిన వారికి అక్కడికక్కడే వాటిని అందిం చారు. నెలపర్టిపాడు గ్రామం లో గడప..గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొ న్నారు. కార్యక్రమంలో ఎంపిపి అంబటి భవాని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పండు గోవిందరాజు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










