ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల జగనన్న సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పాల్గొని అర్హులకు ధృవపత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్షను సద్వినియోగంచేసుకోవాలని అన్నారు.
రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని గంగు మల్ల వీధి సచివాలయం పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. మంత్రి స్థానిక ప్రజాప్రతి నిధులు ధ్రువపత్రాలు కావలసిన వారికి అక్కడ ికక్కడే వాటిని అందించారు. కార్యక్రమంలో రామచం ద్రపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ కె.శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పండు గోవిందరాజు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొ న్నారు. ఆత్రేయపురం మండలంలోని వసంతవాడ వెలిచేరు గ్రామాల్లో శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డిఒ ముక్కంటి పాల్గొని ప్రజలకు అవసరమైన ధృవపత్రాలను అందించారు. కార్యక్రమములో ఎంపిపి కుండ అన్నపూర్ణ, ఉపాధ్యక్షులు పెన్మెత్స బంగార్రాజు, జెడ్‌పిటిసి సభ్యుడు బోణం సాయిబాబా, మండల వ్యవసాయ కమిటీ ఛైర్మన్ కనుమూరి శ్రీనివాస రాజు, ఎంపిడిఒ నాతి బుజ్జి, తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్ గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళల అంబాజీపేట మహిళల పొదుపు సొమ్ము దుర్వినియోగంపై ఎపిఎం డ్వాక్రా యానిమేటర్ లతో సమావేశం నిర్వహించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఎ చిట్టిబాబు సూచించారు. జగనన్న సురక్ష కార్యక్రమం పుల్లేటికుర్రు 1,2 సచివాలయాలలో శుక్రవారం జరిగింది. దీనిపై స్థానిక సర్పంచ్ జల్లి బాలరాజు మాట్లాడుతూ మహిళల పొదుపు సొమ్ము యానిమేటర్ దుర్వినియోగం చేస్తున్నా ఆరు మాసాల నుంచి జనరల్ బాడీ సమావేశంలో విన్నవిస్తున్న వారి పొదుపునకు సురక్ష లేద న్నారు. ఈ సర్టిఫికెట్లు మే, జూన్ నెలలలో ఇస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుం దన్నారు. కార్యక్రమంలో ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి సభ్యుడు బూడిద వరలక్ష్మి లక్ష్మీపతి, ఎంపిడిఒ కె. సత్యనారా యణమూర్తి, తహశీల్దార్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.










