Jul 26,2023 00:18

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో మంగళవారం పలుచోట్ల జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అర్హులకు ధృవపత్రాలు అందజేశారు. వివరాలు ఇవి..
రామచంద్రపురం అర్హులందరికీ సంక్షేమ పథకాలుఅందించాలనే ఉద్దేశంతో సిఎం జగన్‌ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ అన్నారు. మంగళవారం వెల్ల గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఎంపిపి అంబటి భవాని, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండు గోవిందరాజు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు కంచుమర్తి బాబురావు,గ్రామ సర్పంచ్‌ సూరిబాబు స్థానిక ప్రజాప్రతినిధులు ,లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆత్రేయపురం అర్హులందరికీ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం ఆత్రేయపురం రైతు విశ్రాంతి భవనం వద్ద సర్పంచ్‌ గడ్డం సుధా అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అర్హులైన అందరికీ మంచి చేసి, సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారము అందరికీ సకాలంలో పథకాలను అవసరమైన ధవపత్రాలను అందించే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అని వివరించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక లక్షా పదమూడు వేల ధవపత్రాలను కేవలం నెలరోజుల వ్యవధిలో అర్హులకు అందించామనీ తెలియజేశారు. కార్యక్రమములో జెడ్‌పిటిసి సభ్యుడు సాయిబాబా, ఎంపిపి అన్నపూర్ణ, ఎంపిడిఒ నాతి బుజ్జి, తహశీల్దార్‌ డివిఎన్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఐ.పోలవరం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, విద్యార్దులకు, అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా 11రకాల సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు ఎంపిపి మోర్త రాణి మిరియం జ్యోతి అన్నారు. జి.మూలపొలం సచివాలయంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమంలో ధృవపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ పిన్నమరాజు వెంకట పతిరాజు, స్థానిక సర్పంచ్‌ మందపాటి విజయలక్ష్మి, భైరవస్వామి, కాటం సత్తిరాజు, మోర్త చిన్న, రేవు అప్పారావు, గుత్తాల మురళీ, వడ్డి లోవరాజు, గిడ్డి ఆనందరావు, తహశీల్దార్‌ ఝాన్సీ లక్ష్మి కుమారి పాల్గొన్నారు.