Jul 14,2023 17:20


ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల జగనన్న సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అర్హులకు ధృవపత్రాలు అందజేశారు.
మండపేట స్థానిక 15, 20 వార్డులకు సంబంధించి కౌన్సిలర్‌ గ్రంథి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రవేశ పెట్టిన వలంటీర్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లు మీ ఇంటికే తలుపు తట్టి ఇస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసిపి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అంతా సేవకులు అయ్యారని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఉండమట్ల శ్రీనివాస్‌ తో కలిసి లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోతంశెట్టి వరప్రసాద్‌ చిట్టూరి సతీష్‌, కొవ్వాడ బేబీ, మలసాని సీతామహాలక్ష్మి, మారిశెట్టి సత్యనారాయణ, కమిషనర్‌ త్రిపర్ణ రామ్‌ కుమార్‌, తాసిల్ధార్‌ టి.ఆర్‌.రాజరాజేశ్వరరావు, మున్సిపల్‌ మేనేజర్‌ టి కనకరాజు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు కొప్పిరెడ్డి పద్మావతి, షేక్‌ మస్తాన్‌ పాల్గొన్నారు. ఆలమూరు అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించి సంక్షేమ పథకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని తహశీల్దార్‌ ఐపి.శెట్టి, ఎంపిడిఒ కె.జాన్‌లింకన్‌ అన్నారు. మడికి శివారు చిలకలపాడు, మోదుకూరు సర్పంచులు యు.లక్ష్మి మౌనిక చిన్నా, పెంటపాటి శ్యామల, వెంకన్న అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న 11 పథకాలకు సంబంధించి వాటి పరిధిలో ధృపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్‌ నల్లి రాజు, ఎఇలు పోశమ్మ, డి.శ్రీనివాస్‌, డిటిలు జానకి రాఘవ, జానకి రామయ్య, ఇఒపిఆర్‌డి రాజ్‌ కుమార్‌, ఎఒ లక్ష్మీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.