ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అర్హులకుధృవపత్రాలు అందజేశారు.
అమలాపురం రూరల్ వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల పరిధి లోని పేరూరు గ్రామ 4వ సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమ క్యాంపస్ శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివద్ధి అధికారి జె. వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పి.శ్రీ పల్లవి, ఆర్ ఐ బాల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కామనగరువు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ నక్కా అరుణకుమారి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి తదితరులుపాల్గొన్నారు. మండపేట అర్హులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. బుధవారం 12,13,27,28లలో జగనన్న సురక్ష కార్యక్రమం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, కౌన్సిలర్లు మలసాని సీతామహాలక్ష్మి, మొండి భవాని ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిలర్లు కొవ్వాడ బేబీ అప్పన్నబాబు, గ్రంథి శ్రీనివాస్, ముక్కా లోవలక్ష్మి, దాలియ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట కొత్తపేట-1 సచివాలయం నందు జగనన్న సురక్ష క్యాంప్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం తహశీల్దార్ జిడి.కిషోర్ బాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపిపి మార్గాన గంగాధర్, ఆముడ ఛైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని పడమర ఖండ్రిక గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా హాజరైన ఎంఎల్‌సి తోట్ల త్రిమూర్తులు తనయుడు తోట పథ్వీరాజ్, ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొని లబ్ధిదారులకు వారు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆత్రేయపురం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం ఈ కార్యకమము యొక్క ముఖ్య ఉద్దేశమని తహశీల్దార్ డివిఎన్ అనిల్ కుమార్ ఎంపీడీవో నాతి బుజ్జి అన్నారు అంకంపాలెం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్, ఎంపిడిఒ నాతి బుజ్జి, సర్పంచ్ ముత్తాబత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.










