Sep 13,2023 22:56

ప్రజాశక్తి-అమలాపురం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన కల్పించి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ఆరోగ్య సేవలు అందిం చడమే లక్ష్యంగా రూపొందించబ డిందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. పేదలందరి ఆరోగ్య భద్రతకై అండగా నిలిచి ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం సిఎం జగన్‌, ఉన్నతా ధికారులు తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించి జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరు విధి విధానాలను వివరించారు. ఈ వీడియో కాన్ఫరె న్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లా డుతూ జగనన్నఆరోగ్య సురక్ష కార్యమ్రంలో మొదటి దశలో వాలంటీర్లు, గహసారథులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన వివరాలు అందించి ఆయా వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలన్నారు. ప్రతి ఇంటిలో ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి, స్థానిక ఎఎన్‌ఎం లకు తెలియజేయాలన్నారు. రెండవ దశలో ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి షుగర్‌, బీపీ, రక్త పరీక్షలు ఆ యొక్క వివరాలను సిటిజన్‌ మొబైల్‌ యాప్‌ లో నమోదు చేయాలన్నారు. శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్‌ రిపోర్ట్‌ సిద్ధం చేస్తారని. ఈ నెల 8న ఉచిత శిబిరాల నిర్వహణ తేదీలను ఎంపిడిఒలు విడుదల చేశారన్నారు. ప్రజల ఆరోగ్య సమ స్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమ ధ్యేయమ న్నారు. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించాల న్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాలను పంపిణీ చేసి. ఆయా వైద్య సేవలను వివరించి అవగాహన పెంపొందించాలన్నారు ఈనెల 16 నుంచి వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌, వైఎస్సార్‌ అర్బన్‌ క్లీనిక్‌ల పరిధిలోని గహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూని టీ హెల్త్‌ అధికారులు సందర్శించాల న్నారు ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలను గుర్తించాలన్నారు. ఆ వివరాలను డాక్టర్లకు అందుబాటు లో ఉంచాలన్నారు ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూ నిటీ హెల్త్‌ ఆఫీసర్లు టోకెన్‌ నంబర్లు జారీ చేయాలన్నారు. మూడవ దశలో వైద్య శిబిరాలు నిర్వహణకు మూడు రోజులు ముందుగా ప్రజాప్రతినిధులు గహ సారధులు వాలంటీర్లు మూడు రోజులలో మీ గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ముందుగా తెలియజేయాలన్నారు. నాలుగో దశలో ఈనెల 30 నుంచి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలోని 432 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 7 అర్బన్‌ ఆరోగ్య కేంద్రా లలో ఈనెల 30 నుండి అక్టోబర్‌ 31 వరకు 56 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జెసి ఎస్‌.నుపూర్‌ అజరు, జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పద్మశ్రీ రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమల కుమారి అదనపు డిఎంఅండ్‌హెచ్‌ఒ భరత్‌ లక్ష్మి, ఫ్యామిలీ డాక్టర్‌ ఫిజీషియన్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుమలత తదితరులు పాల్గొన్నారు.