- అంగన్వాడి మహాసభలను విజయవంతం చేయాలి
- చర్చ లేకుండానే ముగుస్తున్న సమావేశాలు
- నూతన విద్యా విధానంతో అంగన్వాడీల విలీనం
- జిల్లాలో అక్టోబర్ 11, 12 తేదీలలో మహాసభలు
ప్రజాశక్తి-మండపేట : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బుట్ట దాఖలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇళ్లా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మండపేటలో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అంగన్వాడీల మహాసభల సన్నాహక కార్యక్రమం జిల్లా కార్యదర్శి కృష్ణవేణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు, ప్రజలు వారి హక్కుల సాధనకై ఉద్యమాలు చేయకుండా ప్రభుత్వం బైండోవర్ కేసులు పెడుతూ గృహనిర్బంధం చేస్తుందన్నారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జోడి జగన్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కనబడకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో సమావేశాలు చర్చలు జరగకుండానే కొన్ని ముగుస్తుండగా కేవలం వారి బిల్లులు ఆమోదించుకునేందుకే కొన్ని సమావేశాలు జరుగుతున్నాయన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే అంగన్వాడీల వేతనాలు వెయ్యి రూపాయలు పెంచుతానని నేటికీ ఐదేళ్లు పాలన ముగుస్తున్న ఒక్క రూపాయి పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల యాప్ లతో పాటు ఫేషియల్ యాప్, రాజకీయ వేధింపులులతో అంగన్వాడీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
పెరిగిన ధరలతో అంగన్వాడీ వేతనాలు పెరిగినట్లా తగ్గినట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ 1975 సంవత్సరంలో పౌష్టికాహారం లోపంతో చిన్నారులు ఎక్కువగా చనిపోతున్న నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని భద్రాచలం మండలం కూనవరంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక పోరాటాలతోనే అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ వేతనాల పెంపు ఉద్యోగ భద్రత తదితర వాటిని సాధించుకున్నామన్నారు. నూతన విద్యా విధానంతో ప్రభుత్వం ఫ్రీ స్కూల్, బాలింతల గర్భిణీల ఆరోగ్యం పక్కన పెట్టిందన్నారు. కేవలం ఫోటోలతో మాత్రమే పని జరుగుతుందన్నారు. నాడు నేడుతో పాఠశాల అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఉపాధ్యాయులు లేక పాఠశాల వెలవెలబోతున్నాయన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని మహిళలపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ పై బిజెపి నాయకులు మాటల యుద్ధం చేస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ మొత్తం ఉన్మాదం సనాతన ధర్మం కోరుకుంటుందన్నారు. మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని సనాతన ధర్మంపై గొంతు చించుకుంటున్నారన్నారు.
జిల్లాలో జరిగే అక్టోబర్ 11, 12 అంగన్వాడి సభలతో పాటు చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఐసిడిఎస్ రక్షణ, వేతనాలు పెంపు ఐక్య పోరాటలతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎం. బలరాం, జి.దుర్గాప్రసాద్, వీర్రాజు, పి వెంకటలక్ష్మి, కె వెంకటలక్ష్మి, డి ఆదిలక్ష్మి, ఎం దుర్గమ్మ, ఎస్ దుర్గా మహేశ్వరి, ఎం బేబీ, బి బేబీ, గంగారత్నం, సిహెచ్ రాణి, ఎం విజయలక్ష్మి, బి సుజాత, బి వెంకటలక్ష్మి, ఎస్ నూక రత్నం మున్సిపల్ నాయకులు కే నరేంద్ర కుమార్, కొండ, అంగన్వాడి రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.










