ప్రజాశక్తి-అమలాపురం
చంద్రయాన్-3 విజయం ద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై అడ్డుగా వచ్చిన మొట్టమొదటి దేశంగా భారత్ ఆవిర్భవించిందనీ,ఈ అద్భుత సాంకేతిక విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నామని జనవిజ్ఞాన వేదిక కోనసీమ జిల్లా మహాసభ తీర్మానించింది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీయు జిల్లా జనవిజ్ఞాన వేదిక (జెవివి) మహాసభ ఆదివారం స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో జరిగింది. ఈ సమావేశానికి జెవివి జిల్లా అధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. జెవివి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్ లు ముఖ్య అతిథులుగా హజరై ప్రసంగించారు. ఇస్రో విజయం దేశవ్యాప్తంగా ప్రజల్లో, విద్యార్థుల్లో ఎంతో ఆసక్తిని కలిగించిందని, ఈ విజయం స్పూర్తి తో సమాజంలో శాస్త్రీయ ధృక్పథం పెంపొందించేలా జెవివి కృషి చేస్తుందని వారు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు ఇఆర్.సుబ్రహ్మజ్యం మాట్లాడుతూ, విక్రమ్ లాండర్ సేప్ లాండింగ్ తర్వాత ప్రగ్యాన్ రోవర్ చంద్రుని మీద తిరుగాడుతూ అక్కడ ఎన్నో శాస్త్రీయమైన అన్వేషణ కొనసాగిస్తుందని అన్నారు. చంద్రునిపై వాతావరణం, నేల స్వభావం, ఖనిజాలు, నీటిజాడలను కనుగొనడం వంటి ప్రయోగాలు మానవాళికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్, డా.చల్లా రవికుమార్ జిల్లా అధ్యక్తులు డాక్టర్ ఇఆర్.సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శిగా ఎండి బాజా మొహినిద్దీన్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ. జనుపల్లి సత్యనారాయణ, కోలా వెంకటేశరావు కార్యదర్శిగా ఈశ్వరరావు, ప్రసాద్ కోశాధికారిగా త్రినాధరావు సమతా కన్వీనర్ గా కళ్యాణి లు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.










