Aug 21,2023 22:37

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
ఇంటింటికీ సంక్షేమ పథకాలను సిఎం జగన్‌ అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగుల నింపుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ అన్నారు. చల్లపల్లి పంచాయతీ ఊరపేటలో సోమవారం నిర్వహించిన గడప..గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, సర్పంచ్‌ లు ఇసుక పట్ల జయమణి, పెయ్యల రాజ్‌ కుమార్‌, వైసిపి రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బద్రి బాబ్జి, పినిపే జయరాజ్‌, ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ బడుగు మేరీ కుమారి, వ్యవసాయ సలహా మండలి మండల అధ్యక్షులు మానే శ్రీను,యువజన విభాగం మండల అధ్యక్షులు ఓగూరి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.