Aug 25,2023 23:27

ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎన్‌.ఎస్‌.వి.బి.వసంత రాయుడు అధ్యక్షతన రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం నందు ఎఇ ఆర్‌ఒ, సూపరవైజర్లు, బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో గత నెల 21 నుంచి ఈనెల 21వ తేదీ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2024 కు సంబంధించి వివిధ అంశాలపై హౌస్‌ టు హౌస్‌ సర్వే లో నమోదు చేసిన చేర్పులు, మార్పులు, తొలగింపులలో నమోదులు సక్రమంగా చేయాలని ఆర్‌డి అన్నారు. ఓటు తొలగింపు నకు సంబంధించి ఓటరు చనిపోయినట్లు అయితే చనిపోయిన వ్యక్తి ఓటు తొలగించాలంటే ఫామ్‌ 7 దరఖాస్తు ఉండాలని,. మరణ ధవపత్రం తీసుకోవాలని, అదే విదంగా శాశ్వతంగా బదిలీ కాబడిన ఓటరు తొలగింపు విషయం లో తప్పనిసరిగా నోటీసు ఇచ్చి, ఒకవేళ ఓటరు అందుబాటులో లేకపోతే సమాచారం తెలిసి ఉన్నట్లు అయితే తప్పనిసరిగా రిజిస్టర్‌ పోస్టు ద్వారా సమాధానమునకు 15 రోజుల గడువుతో పంపవలెనని తెలియజేశారు.. ఈ ఆర్వో నెట్‌ 2.0 ప్రకారం ఓటుఏ నియోజకవర్గం లో ఉన్నా సరే ఇపిఐసి నెంబర్‌ ద్వారా ఫామ్‌ -8 ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు అయితే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గానికి మార్చుకోవచ్చునన్నారు. 20 సంవత్సరాలు పైబడిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసినట్లు అయితే వారికి పూర్వం ఉన్న ఓటరు ఇ పిఐసి నెంబర్‌ తో పాటు ఫామ్‌ -8 నందు దరఖాస్తులు స్వీకరించవలెనని, ఒక వ్యక్తి నుండి ఎక్కువ ధరఖాస్తులు స్వీకరిం చవద్దన్నారు. ఓటర్ల దరఖాస్తుల పరిశీలనలో బిఎల్‌ఎలతో పాటు పరిశీలించాలన్నారు.