Aug 27,2023 00:06

ప్రజాశక్తి-కొత్తపేట
కొత్తపేట గ్రామంలో భాస్కర హాస్పిటల్స్‌ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా ఐవీఎఫ్‌ సెంటర్‌ ను ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు వేర్వేరు సమయాల్లోనూ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డా.మెంటే ఉదయభాస్కర్‌ ఫ్యామిలీ అంతా వైద్య వృత్తిలోలోనే ఉన్నారని, కొత్తపేట గ్రామ పరిసర ప్రాంతాల వారు దూరప్రాంతాలు వెళ్లాలనవసరం లేకుండా అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచారన్నారు.