Jul 09,2023 23:29

ప్రజాశక్తి-అమలాపురం
మలికిపురంలో జరిగిన జిల్లాస్థాయి పవర్‌ లిప్టింగ్‌ పోటీల్లో అమలాపురం హెల్త్‌ అండ్‌ ఫిట్నెస్‌ జిమ్‌ జట్టు ఛాంపియన్‌ షిప్‌ ను సాధించడంతో పాటు స్ట్రాంగ్‌ మెన్‌ గా వీరేంద్ర, స్ట్రాంగ్‌ ఉమెన్‌ గా వందనలు గెలుపొందారు. నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా టీం ఛాంపియన్షిప్‌ అందుకుంది. మెన్‌ విభాగంలో తతీయ స్థానం, ఉమెన్‌ విభాగంలో తతీయ స్థానం సాధించారు. ఈ నెలలో 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించే మాస్టర్స్‌ నేషనల్‌ పవర్‌ లిప్టింగ్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ టీమ్‌ నుంచి హెల్త్‌ అండ్‌ ఫిట్నెస్‌ జిమ్‌ కి చెందిన చీకురుమల్లి కిరణ్‌ కుమార్‌, బి.అప్పన్న, ఆకుల శివప్రసాద్‌ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ హెల్త్‌ అండ్‌ ఫిట్నెస్‌ జిమ్‌ లో ఏర్పాటుచేసిన ఈ అభినందన కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షులు యేనుముల కష్ణపద్మరాజు మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.