ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో శనివారం జాతీయ వైద్యుల దినోత్సవాని ఘనంగా నిర్వహించారు.
ఆలమూరు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలమూరు సిహెచ్‌సిలో వైద్యాధికారి డాక్టర్ పి.గోపీ రామ్, చొప్పెల్ల పిహెచ్‌సిలో వైద్యాధికారిని డాక్టర్ సువర్చలా నాయుడు, పెద్దపల్ల పిహెచ్‌సిలో వైద్యాధికారి డాక్టర్ పి.భవాని శంకర్‌ల ఆధ్వర్యంలో రోగులకు వైద్య సేవలు అందించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్లు హిమబిందు, షమీ ఉన్నీస, రాహుల్, మనుదీప్, మేఘ స్పందన, సుదర్శన్ బాబు, మల్లికార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్ ఎవివి.రాజా, సిహెచ్‌ఒ రాధాకృష్ణ, హెల్త్ సూపర్‌వైజర్లు పివి.రమణారావు, వెంకటేశ్వరరావు, పి.ఉమ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక శ్రీసిద్ధార్థ హైస్కూల్లో జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు ఆసంస్థ అధినేత ముల్లారావు సమక్షంలో శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, టీచర్స్ పాల్గొన్నారు.ఆత్రేయపురం వైద్యుల దినోత్సవాన్ని ఆత్రేయపురం పిహెచ్‌సిలో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వైద్యురాలు సుస్మితను సత్కరించినారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పేరూరి నాగేశ్వరరావు, కార్యదర్శి పట్నాల నాగరాజు, కోశాధికారి వెచ్చ నాగ వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ర్యాలి గ్రామం స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద డాక్టర్స్ డే సందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీత ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్ కష్ణ సౌజన్యంతో పేదలకు ఉచిత ఫిజియోథెరపీ మెటీరియల్, బి కాంప్లెక్స్ టానిక్స్ అందజేశారు. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన వెళ్లే యాత్రికులకు ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. మండపేట మండపేట, ఆలమూరు మండలాల పిఎంపి అసోసియేషన్ నాయకులు జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను మండపేట లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, డాక్టర్ బిక్కిన గోపాల కృష్ణ, డాక్టర్ బిక్కిన పద్మా గోపాలకృష్ణ, డాక్టర్ కిరణ్ కుమార్ లను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోన సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బల్లా వెంకటరవణ, తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం అంగర పిహెచ్‌సిలో డాక్టర్స్ డే ఘనంగా జరిగింది. పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు ఆధ్వర్యంలో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్. టి రామారెడ్డిని, మండలప్రధాన కార్యదర్శి సూరంపూడి వీరభద్రరావు తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ బి.రామారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










