జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు అందజేశారు.
ప్రజాశక్తి-యంత్రాంగం
అమలాపురం ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమావేశ మందిరంలో ఉపాధ్యా య దినోత్సవాన్ని నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐవి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 34 మంది అవార్డులు అందించి సత్కరించారు. రామచంద్రపురం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ ఘనంగా నివాళులర్పించారు. రామచంద్రపురం లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ హై స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఛైర్మన్ గాదం శెట్టి శ్రీదేవి, వాడ్రే వు సాయి ప్రసాద్, ఎంపిపి అంబటి భవాని తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ బిసి సేన ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవం ద్రాక్షారామలో ఘనంగానిర్వహించారు. ద్రాక్షారామ మసీద్ సెంటర్‌లో ఉన్న సావిత్రీ బాయిపూలే,మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాలకు యాట్ల నాగేశ్వరరావు, ఆయన భార్య మాజీ ఎంపిటిసి యాట్ల రోజారాణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మామిడికుదురు గోగన్న మఠం యూపీ పాఠశాల ఉపాధ్యా యులు రామాయణం శ్రీరామ చల్లమ్మ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రశంసా పత్రాన్ని కలెక్టర్ ఆమెకు అందజేశారు. పురస్కార గ్రహీతను ఎంఎల్‌ఎసి ఇళ్ల వెంకటేశ్వరరావు, గోగన్నమఠం ఉపాధ్యాయ బృందం, ఎంపిపి కుసుమ వనజ కుమారి శ్రీధర్ తదితరులు అభినందించారు. మామిడికుదురు మెయిన్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కొమ్ముల వీర రాఘవరావుకు జిల్లా కలెక్టర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రశంస పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు, పరిపాలన అధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు, ఎంఇఒ-1 లక్ష్మీనారాయణ, ఎంఇఒ- 2 ఎం.వెంకన్నబాబు తదితరులు అభినందించారు. ఐ.పోలవరం హైస్కూల్ హెచ్‌ఎం వీధి సురేష్ బాబుకు జిల్లా కలెక్టర్ జిల్లా ఉత్తమ అవార్డు ప్రశంసాపత్రం అందు కున్నారు. ఎస్‌టియు జిల్లా అభరు కో కన్వీనర్ యు.వీర వెంకట్రావు, యుటిఫ్ మండల మహిళా అధ్యక్షురాలు వి.విజయ లక్ష్మి, కొమ్మన జనార్దనరావు తదితరులు సరేష్‌బాబును అభినందించారు. ఆలమూరు మండలంలోని మడికి శివారు చిలకలపాడు ప్రాథమిక పాఠశాల్లో పిఎస్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న జి.భాస్కర్ రెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు. గురుపూజోత్సవం సందర్భంగా సర్పంచ్ తమ్మన శ్రీనివాసు చెముడులంక ఎస్టిఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం శివరాం కుమార్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిఎస్ చక్రవర్తి, దొండపాటి చంటి, దొండపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మండపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ద్వారపూడి జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో సైన్స్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్న గండి స్వామి ప్రసాద్ ఎంపికయ్యారు. ఆయన జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, డిఇఒ కమలకుమారి, ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వర రావు, జిల్లా ఉప విద్యా శాఖాధికారి పి.శాలెం రాజు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు డా.చల్లారవికుమార్, జెవివి జిల్లా అధ్యక్షులు డా.ఈ.ఆర్.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు కెవివి.సత్యనారాయణ, జె.సత్యనారాయణ, చెకుముకి జిల్లా కన్వీనర్ ఎన్.అబ్బులు, ఎంఇఒ ఎన్.రామచంద్రరావు, యుటిఎఫ్ మండలశాఖ అధ్యక్షులు ఎం.త్రినాథరావు, కార్యదర్శి తాడి శ్రీనివాస తదితరులు అవార్డు గ్రహీతకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులని సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం అన్నారు. ఏడిద గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, బూరిగ, వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న 31 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్ పైడిమల్ల పెద్దబ్బు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకట్రాజు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మండపేట ఎంపిపికార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు ఆధ్వర్యంలో సర్వేపల్లి చిత్రపటానికి డిజిపఒ కృష్ణకుమారి, తహశీల్దార్ టిఆర్. రాజేశ్వరరావు తదితరులు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. కొత్తపేట స్థానిక క్రాంతి భారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్‌తోట సత్యవాణి. జిల్లా ఆముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్, ఎంపిపి మార్గన గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి టివి.సురేంద్ర రెడ్డి, ఎంఇఒలు తదితరులు పాల్గొన్నారు అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవలు నిరూపమానం ప్రముఖ ఇంద్రజాలికుడు శ్యామ్ జాదూగర్ అన్నారు అని ర్యాలి గ్రామంలోని స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద భారత్ టాలెంట్ అసోసియేషన్ మరియు అనూస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, మరియు ఆయాలను దుశ్శాలువా, సర్టిఫికెట్ల, మెమెంటులతో సత్కరించారు ఉప్పలగుప్తం జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు , సత్యవతి దంపతులు మండలంలోని తొమ్మిది జెడ్‌పి ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం లను సంపదరావు ఇంటివద్ద సత్కరించారు. అమలాపురం రూరల్ ఎంపిడిఒ కార్యాలయం సమావేశం మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జెడ్‌పిటిసి సభ్యులు పందిరి శ్రీహరి రామ్ గోపాల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వి జానకి సత్యభాను, మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పి. ప్రభాకర్, కె.ఆర్.ఎన్.ప్రసాద్, ఆకుల బాల బసవేశ్వర రావు తదితరులను సత్కరించారు.










