ప్రజాశక్తి - అంబాజీపేట
టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గుడాల ఫణి పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఫణితో పుట్టిన రోజు కేక్‌ను కట్ చేయించారు. పూలదండలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు ఫణి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీనియర్ నాయకులు వక్కలంక బుల్లియ్య, అరిగెల బలరామ్మూర్తి, జివి.రాఘవులు, బి.పెదబాబు, నేదునూరి వీర్రాజు, సర్పంచ్‌లు బొండాడ నాగమణి, జల్లి బాలరాజు, ఎంపిటిసి సభ్యులు పబ్బినీడి రాంబాబు, ఎన్.వి.సుబ్బారావు, చిన్నం విజయారావు, గోగు రమేష్, మందపాటి కిరణ్ కుమార్, దొమ్మేటి శ్యామ్, ఎన్‌వి.రమణబాబు, బిబి.జోగేష్, నియోజకవర్గ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.










