Aug 06,2023 23:52

ప్రజాశక్తి-యంత్రాంగం
దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు 70వ జయంతి పలుచోట్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం: జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా రామచంద్రపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకష్ణ రామోహన్‌ చిత్ర పటానికిపూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి నాకు రాజకీయ గురువు అని ఆయన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకుడు జక్కంపూడి యువసేన అధ్యక్షులు తొగరుమూర్తి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పిండి సురేష్‌, సలాది నానాజీ, యాళ్ళ సత్తిబాబు, పట్టణ కన్వీనర్‌ గాదంశెట్టి శ్రీధర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీనివాస్‌, మధు తదితరులు పాల్గొన్నారు. మండపేట: మండలంలోని కేశవరం గ్రామంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జయంతి వైసిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసికేక్‌ కట్‌ చేసి పార్టీ నాయకులకు అందరికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఆర్‌బికె ఛైర్మన్‌ అన్నందేవుల చంద్రరావు, కేశవరం సొసైటీ చైర్మన్‌ ముక్కపాటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.