ప్రజాశక్తి-అమలాపురం
అంబేద్కర్ కోనసీమ జిల్లా వెలుగు యానిమేటర్స్ సమావేశం గురువారం యానిమేటర్ జ్యోతి అధ్యక్షతన అమలాపురం యుటిఎఫ్ హోమ్ నందు నిర్వహించారు. సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, యానిమేటర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆమెమాట్లాడుతూ అనేక పోరాటాలతోనే వేతనాలు సాధించు కున్నామని అన్నారు. విఒఎలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని గద్దించగలరని, తక్షణమే విఒఎలకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 5 జి సిమ్ములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలుజేయాలని లేనీ పక్షంలో రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల విఒఎలను చాలా వేధింపులకు గురి చేస్తున్నారని అలాగే అధికారులు కూడా రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతూ అనేక చోట్ల ఇబ్బందులు పెడుతున్నారనీ అన్నారు. విఒఎలకు రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం విఒఎల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా కె.కృష్ణవేణి, జిల్లా అధ్యక్షులుగా సిహెచ్.జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా పాము వెంకటలక్ష్మి, కోశాధికారిగా ఎన్.జ్యోతి తదితరులు ఎన్నికైనట్లు యూనియన్ నాయకులు తెలిపారు.










