ప్రజాశక్తి - అంబాజీపేట
గ్రూప్-1 పరీక్షలలో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన ముమ్మిడివరం మండలం అనాతవరం సర్పంచ్ మిమ్మితి చిరంజీవి కుమారుడు భాను ప్రకాష్‌రెడ్డికి మాచవరం సర్పంచ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ ల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు లు మంగళవారం పుష్పగుచ్చం అందించి సత్కరించి,. అభినందించారు. అనాతావరంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేత భాను ప్రకాశ్ రెడ్డి తల్లిదండ్రులైన చిరంజీవి,శాంతకుమారి దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. సర్పంచ్ కుమారుడు గ్రూప్-1 లో విజేత కావడం, డైరెక్ట్ గా డిప్యూటీ కలెక్టరుగా ఎంపిక కావడం జిల్లాకేగర్వకారణమన్నారు.ఉప్పలగుప్తం: ఎపిపిఎస్‌సి గ్రూప్-1 ఫలితాల్లో ఐదో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన అనాతవరం సర్పంచ్ మిమ్మితి చిరంజీవి కుమారుడు భాను ప్రకాశ్ రెడ్డి కి మంగళవారం అంబేద్కర్ జిల్లా సాధన సమితి మండల కన్వీనర్ కుంచే బాబులు ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. అనాతవరం లోని భాను ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భాను ప్రకాశ్ రెడ్డి కి దుశ్శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. అభినందనలు తెలిపిన వారిలో సాధన సమితి సభ్యులు కొంకి ఏడుకొండలు, గుత్తాల సుభాష్ చంద్రరావు, దేవరపల్లి వెంకటేశ్వరరావు, రాంబాబు, తాళ్ల రవి, అయితాబత్తుల ముకుందరావు, శ్రీనివాసరావు, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.










