Aug 21,2023 23:24

ప్రజాశక్తి-మండపేట
మండలంలోని ఏడిద గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కళావేదిక, రధం వీధిలో గ్రంథాలయంను విద్యాదాత, వ్యాపారవేత్త, పోరస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత నామాల పురుషోత్తమరావు సహకారంతో నిర్మితమవుతున్నాయి. సోమవారం పురుషోత్తమరావు అనంతలక్ష్మి దంపతులు నిర్మాణ పనులు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తని విద్యార్థులు శ్రద్ధగా చదువుకున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రూ.1.70కోట్లతో గ్రామంలోని పాఠశాలలో 12 అదనపు తరగతి గదుల నిర్మాణం, పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినికి రూ.2లక్షల నగదు బహుమతి అందజేత తదితర వాటితో విద్యాభివద్ధికి సహకారం అందిస్తున్న పురుషోత్తమరావు దంపతులకు గ్రామస్తులు కతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట రిటైర్డ్‌ ఉపాధ్యాయులు గెడా శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకట్రాజు తదితరులు ఉన్నారు.