ప్రజాశక్తి-అమలాపురం రూరల్
ప్రతి పేద కుటుంబానికి కుల, మతం భేదం లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. నడిపూడి గడప..గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి గడప..గడపకూ తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు పట్ల లబ్ధిదారుల నుంచి స్పందనను తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమకు ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యలు పరిష్కార దిశగా సంబంధిత అధికా రులు దృష్టి సారించాలన్నారు. తదుపరి స్థానిక రూరల్ పరిధిలోని భట్నవిల్లి లో హైటెక్ కాలనీలో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. భట్నవిల్లి హైటెక్ కాలనీలో రూ.38.50 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, శెట్టిపేట లో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌సిలు బొమ్మి ఇశ్రాయెల్, కుడిపూడి సూర్య నారాయణ రావు, నడిపూడి సర్పంచ్ చెల్లిబోయిన నాని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జగన్నాయకులపాలెం లో గడప..గడపకూ..
ప్రజాశక్తి-రామచంద్రపురం
మండలంలోని జగన్నాయకుల పాలెం గ్రామంలో బుధవారం గడప..గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమకు ఉన్న సమస్యలను మంత్రివ దష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సిఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అంబటి భవాని, వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మన్ సాధే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.










