- ఆలస్యం అవుతున్న ఖరీఫ్ సాగు
ప్రజాశక్తి - కపిలేశ్వరపురం : ఈ సంవత్సరం అనుకున్న ఖరీఫ్ పంట సమయానికి సాగునీరు అందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. జూన్ ఒకటో తేదీన కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి నీటిని విడుదల చేశారు. అయితే శివారు ప్రాంతాలకు ఇప్పటి వరకు సాగునీరు చేరకపోవడంతో తొలకరి పంట మరింత ఆలస్యం అవుతుంది. జూలై రెండవ వారం మొదలైనప్పటికి కపిలేశ్వరపురం మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందకపోవడంతో పలువురు రైతులు నారు మడులు వేసుకునేందుకు సాగునీరు అందడం లేదు. ముఖ్యంగా తాతపూడి, నేలటూరు, కాలేరు, వడ్లమూరు, వాకతిప్ప, నాగులచెరువు, శివారు ప్రాంతాల్లో సాగునీరు అందక నారుమడులు మరింత ఆలస్యం అవుతుంది. దీనిపై రైతులు ఇరిగేషన్ అధికారులతో సంప్రదించగా గోదావరి నదిలో నీటిమట్టం తగ్గిందని వారం రోజుల్లో నీటిమట్టం పెరుగుతుందని వరినాట్లు వేసుకునేందుకు సాగునీరు ఆటంకం ఉండదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పంట కాలువల్లో ఆధునీకరణ పనులకు చర్యలు చేపట్టకపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ప్రోక్లైనర్ సహాయంతో కాలువను ఆధునికరించినట్లు రైతులు తెలిపారు. నీటి ఎద్దడి లేకుండా ఇరిగేషన్ అధికారులు కాలువలు అభివృద్ధిని పట్టించుకోవాలని రైతుల విజ్ఞప్తి చేశారు. వచ్చే వేసవిలో అయిన పంట కాలువలు అభివృద్ధి చేసి వరి సాగుకు ఆటంకం లేకుండా సాగు నీటిని విడుదల చేయాలని రైతుల కోరుతున్నారు.










