Jul 14,2023 17:35

ప్రజాశక్తి-మండపేట
ఏడిద గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం, వైస్‌ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావులు శుక్రవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన ్‌కాన్సెప్ట్‌తో అందిస్తున్న వైద్య సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెచ్‌బి, ఆర్‌బియెస్‌, హెచ్‌ఐవి, యూరిన్‌ ప్రెగెన్సీ, స్ఫుటం, డెంగీ తదితర 15 రకాల ఉచిత పరీక్షలతో మందులు ప్రభుత్వం అందజేస్తారన్నారు. అనంతరం వైద్యులు డాక్టర్‌ వంశీ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నీటి నిల్వలు ద్వారా వ్యాపిస్తాయన్నారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వ లేకుండా చూసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ దోమ కాటుకు గురికాకుండా దోమతెరలు, ఆల్‌ అవుట్‌ తదితర పరికరాలు వినియోగించుకోవాలన్నారు. ఈగలు వాలిని పదార్థాలను తినరాదన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పలివేల సుధాకర్‌, జానీ, పంచాయతీ కార్యదర్శి వీర్రాజు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు