Sep 03,2023 00:06

ధరలు అదుపు చేయడంలో కేంద్రం విఫలం

ప్రజాశక్తి-ఐ.పోలవరం
కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుదే దుర్గాప్రసాద్‌ విమర్శించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసరించుకోవాలని, నిత్యం పెరుతున్న నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు వినతిపత్రం సమర్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం జి.వేమవరం, గుత్తెనదీవి గ్రామ పంచాయతీల్లో నిరసన తెలిపి సచివాలయం కార్యదర్శులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుదే దుర్గాప్రసాద్‌ సమర్పించారు.ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తానని, విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని గాలికి వదిలేసి 7 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారని అన్నారు. విద్యుత్‌ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ముమ్మిడివరపు సుబ్బారావు, లక్ష్మీ దేవి, వెంకటరావు, జె.సత్యనారాయణ, పి. వీర్రాజు, పెద్దిరాజు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలి
అమలాపురం రూరల్‌ పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఎ.వేమవరం, ఎ.వేమవరప్పాడు, నల్లమిల్లి, జనపల్లి పంచాయతీలలో నిరసన తెలిపారు. అనంతరం సచివాలయం కార్యదర్శులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వ్యవసాయ కార్మిక సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ పి. దైవవాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైంది అన్నారు. పెంచిన.విద్యుత్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, సరోజిని, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.