Aug 22,2023 23:40

ప్రజాశక్తి-అయినవిల్లి
సిరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ఎబైట్‌ స్ప్రేయి ంగ్‌ ను మంగళవారం గ్రామ కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో స్ప్రేయింగ్‌ చేయించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గుంతల్లో, తొట్టిలో నీటిని నిలవ ఉంచరాదని వర్షాకాలం కావడంతో దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా జ్వరాల బారిన పడకుండా పరిసరాలును పరిశుభ్రంగా ఉంచుకోవాలని ద్వారా దోమలను నివారించవచ్చని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్ర మంలో గ్రామ వైద్య సిబ్బంది, ఎఎన్‌ఎం సుచ రిత, యంల్‌హెచ్‌పి ప్రసన్న, సూపర్‌వైజర్‌ ప్రసాద్‌, లక్ష్మీనారాయణ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.